- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIT: మహిళా ఐఏఎస్‌పై ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం.. సిట్ ఏర్పాటు చేసిన డీజీపీ
సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ను కించపరిచేలా పలు మీడియాలో వచ్చిన కథనాలు, నారాయణపేట జిల్లా మద్దూరులో నమోదైన కేసుల్లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేశారు. మహిళా ఐఏఎస్ ను కించపరిచేలా వార్తా కథనాలు ప్రచారం చేశారని తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ కేసు నమోదు చేయగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అసభ్యకరంగా పోస్టు చేశారని కావలి వెంకటేశ్ పై కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహా ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 11న కేసు నమోదు అయింది. ఈ రెండు కేసులపై దర్యాప్తు చేపట్టేందుకు హైదరాబాద్ సిటీ సీపీ వి.సి సజ్జనార్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ లో నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకట లక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీబీ అరవింద బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్, సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సైబర్ సెల్ సీఐ శంకర్ రెడ్డి, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్ఐ హరీశ్ ఉన్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు అసభ్యకరంగా పోస్టు చేసి తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సప్ గ్రూప్ లో పోస్టు చేశారని కావలి వెంకటేశ్ పై కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై ఈ నెల 11న కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సిట్ ను డీజీపీ ఆదేశించారు.
READ MORE .....






