డ్రగ్ పార్టీలోవ్యాపారవేత్తలు, అడ్వకేట్లు ఎందుకు? కూపీ లాగుతున్న సిట్

by Prasad Jukanti |   (  Updated:2026-03-17 12:25:35  IST  )

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది.

డ్రగ్  పార్టీలోవ్యాపారవేత్తలు, అడ్వకేట్లు ఎందుకు?  కూపీ లాగుతున్న సిట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న మొయినాబాద్ డ్రగ్ పార్టీ కేసు (Moinabad Drugs Case) విచారణ కోసం ఏర్పాటైన సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్ లో మొత్తం 11 మందిపై కేసు నమోదవగా వీరిలో 8 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. వీరిని ఇవాళ వీరిని శంషాబాద్ రూరల్ పీఎస్‍లో సిట్ (SIT Investigation) విచారిస్తోంది. రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ సిట్ నిందితుల నుంచి పలు కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలలో చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని, పార్టీ కోసం బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తలు, అడ్వకేట్లు ఎందుకొచ్చారు? అనే కోణంలో సిట్ దృష్టి సారించింది. ఈ పార్టీ వెనుక పెద్ద బిజినెస్ డీల్ ఉందనే ప్రచారం జరుగుతుండగా సిట్ సైతం అదే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

వెలుగులోకి సంచలనాలు?:

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ వ్యవహారంలో రోజురోజుకు కొత్త ట్విస్టులు తెరమీదకు వస్తున్నాయి. ఈ పార్టీ వెనుక దుబాయ్ కనెక్షన్లు ఉన్నాయని, డ్రగ్స్ వ్యాపార కోణం ఉందనే చర్చ జరుగుతోంది. అలాగే రాజకీయ ప్రముఖుల ఇన్వాల్వ్ మెంట్ ఉండటంతో కేసు దర్యాప్తులో చివరాఖరికి ఏం తేలబోతోంది అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Next Story