- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SIT: బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ జితేందర్ సంచలన ఆదేశాలు
రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఐదుగురు అధికారులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (Special Investigation Team)ను (SIT) నియమించింది. ఈ మేరకు ఇవాళ డీజీపీ జితేందర్ (DGP Jitender) అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అదేవిధంగా సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్ (IG Ramesh) నిమమితులయ్యారు. సభ్యులుగా సింధు శర్మ (Sindhu Sharma), వెంకటలక్ష్మి (Venkata Lakshmi), చంద్రకాంత్ (Chandrakant), శంకర్ (Shankar)లకు అవకాశం కల్పించారు. బెట్టింగ్స్ యాప్స్ (Betting Apps) వ్యవహారంపై రానున్న 90 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయాలని డీజీపీ జితేందర్ (DGP Jitender) సిట్ బృందాన్ని ఆదేశించారు. కేసుల దర్యాప్తునకు అవసరమైన ఇతర అధికారులను సిట్ ఎంపిక చేసుకోనుంది. అందులో ఆర్థిక నిపుణులు, న్యాయ నిపుణులు, ఆడిటర్లు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను సీఐడీ అదనపు డీజీ అనుమతితో సిట్ నియమించుకునే అవకాశం ఉంది.
కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ (Betting Aap Promotion) చేసిన 11 మంది సెలబ్రిటీలు (Celebrities), సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల (Social media Influencers)పై ఇటీవలే పంజాగుట్ట (Panjagutta), మియాపూర్ (Miyapur) పోలీసులు కేసులు నమోదు చేసి నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నోటీసులు అందుకున్న పలువురు సెలబ్రిటీలు తమపై నమోదైన కేసులు కొట్టివేయాంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా.. ధర్మాసనం వారిపై ఎఫ్‌ఐఆర్ (FIR)ను కొట్టివేసేందుకు, దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణలో పిటిషనర్లు పోలీసులకు సహకరించాలని.. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించాలంటూ పోలీసులకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఆన్‌లైన్ బెట్టింగ్ (Online Betting) అంతర్జాతీయ నేరంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ నెల 26న అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొబోతున్నట్లుగా వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ నిరోధానికి, నిషేధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర డీజీపీ జితేందర్ బెట్టింగ్ యాప్స్ సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల బెట్టింగ్ యాప్స్ బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






