SIT: ఎన్టీవీ కార్యాలయంలో సిట్ సోదాలు.. టెన్షన్ టెన్షన్

by Prasad Jukanti |   (  Updated:2026-01-14 09:38:39  IST  )

మంత్రి, మహిళా ఐఏఎస్ పై ఆరోపణల కేసులో సిట్ ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు చేపట్టింది.

SIT: ఎన్టీవీ కార్యాలయంలో సిట్ సోదాలు.. టెన్షన్ టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి, మహిళా ఐఏఎస్ పై ఆరోపణల కేసులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఎన్టీవీ ఆఫీస్ లో (NTV Office) సిట్ సోదాలు (SIT Raids) చేపట్టింది. ఈ కేసులో గత అర్ధరాత్రి పోలీసులు ఎన్టీవీకి చెందిన ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం మధ్యాహ్నం ఎన్టీవీ కార్యాలయానికి వచ్చారు. నేరుగా కార్యాలయం లోపలికి వెళ్లి సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు నిర్వహించేందుకు ఎలా వస్తారని ఎన్టీవీ సిబ్బంది ప్రశ్నంగా అధికారులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సెక్యూరిటీని తోసేసి ఆఫీస్ లోకి పోలీసులు చొచ్చుకు వచ్చారని ఎన్టీవీ సిబ్బంది చెబుతున్నారు. ఎడిటర్ ఎవరు? ఎడిటర్ క్యాబిన్ ఎక్కడ అంటూ బెదిరించారని, చెప్పకుంటే చానల్ సర్వర్ రూమ్ సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరో వైపు రాత్రి పూట జర్నలిస్టుల అరెస్టులను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఖండించింది.

Next Story