- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌లకు సిట్ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని వారికి ఇచ్చిన నోటీసుల్లో అధికారులు ఆదేశించారు. మరీ సిట్ నోటీసులకు మాజీ సీఎస్, మాజీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌లు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 600 మందికి పైగా రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు మరియు వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు ప్రారంభమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావు, సుదీర్ఘ కాలం అమెరికాలో ఉండి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 2025లో భారత్‌కు తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ప్రత్యేక విచారణ బృందం (SIT) సుదీర్ఘంగా విచారిస్తోంది






