- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Naveen Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. కేసీఆర్ ఫ్యామీలికి సన్నిహిత ఎమ్మెల్సీకి నోటీసులకు సర్వం సిద్ధం?
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు (BRS MLC Naveen Rao) నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో (phone tapping case) నవీన్ రావుది కీలక పాత్ర అని మీడియా సంస్థ అధినేత, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును వెనుకుండి నడిపించిందే నవీన్ రావు అనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో నవీన్ రావు పాత్రపై తీవ్ర ఆరోపణలే వినిపిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న శ్రవణ్ రావు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విదేశాల నుంచి వెనక్కి రావడంతో వారిని విచారించింది. దర్యాప్తులో శ్రవణ్ రావుకు నవీన్ రావుకు మధ్య ఉన్న బసంబంధాలను సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించేందుకు దర్యాప్తు బృందం అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ కుటుంబంతో సన్నిహత సంబంధాలు కలిగిన నవీన్ రావు పేరు మళ్లీ తెరపైకి రావడంతో ఈ కేసు దర్యాప్తు ఎలాంటి ట్విస్ట్ తీసుకోబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.






