- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ పెద్దలతో వాట్సప్ చాట్.. TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది. గత కొద్ది రోజులుగా ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న సిట్.. విచారణలో నిందితుల నుండి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు రామచంద్రభారతి, నందకూమార్ ఢిల్లీ పెద్దలతో చేసిన వాట్సాప్ చాట్ సంభాషణ వివరాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. వాట్సప్ సంభాషణలో కీలక వివరాలు సేకరించిన సిట్.. ఈ వివరాలను హైకోర్టుకు సమర్పించింది. అంతేకాకుండా ఢిల్లీ పెద్దలతో నిందితులు దిగిన ఫొటోలను కూడా సిట్ కోర్టుకు సమర్పించింది. అయితే, ఢిల్లీ పెద్దలతో నిందితులు చేసిన వాట్సప్ చాట్ సిట్ చేతికి చిక్కడంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
READ MORE
కూతురు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేకు KCR షాక్.. Kavitha పోటీ అక్కడి నుంచేనా?
Next Story






