Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశాలపై సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు!

by Ramesh Naini |

బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్‌దేనని కాళేశ్వరం కమిషన్ తేల్చిచెప్పింది.

Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశాలపై సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్‌దేనని కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) తేల్చిచెప్పింది. జవాబుదారీతనం, పాలనాపరమైన విధానాలు పాటించలేదని కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక అంశాలపై సిట్ (SIT) ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డీజీ (DG) స్థాయి అధికారులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం అందుతోంది. కాగా, జస్టిస్ పి.చంద్రఘోష్ కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది. కాళేశ్వరంపై మొత్తం 10 పేజీలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఈ మేరకు తాజాగా కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక మీడియాకు లీకైంది. ప్రాజెక్టులో విధాన, ఆర్థిక పరంగా అవకతవకలు జరిగాయి కమిషన్ పేర్కొంది. పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరగిందని రిపోర్టులో ప్రస్తావించారు. కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని కమిషన్ రిపోర్టు బయటపెట్టింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story