ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. నేడు మరోసారి విచారణకు ప్రభాకర్ రావు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-19 06:23:39  IST  )

మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) అమెరికా నుంచి వచ్చిన నాటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ తన దర్యాప్తును జెట్ స్పీడ్‌తో కొనసాగిస్తుంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. నేడు మరోసారి విచారణకు ప్రభాకర్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) అమెరికా నుంచి వచ్చిన నాటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ తన దర్యాప్తును జెట్ స్పీడ్‌తో కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలుమార్లు సిట్ అధికారుల ఎదటు హాజరైన ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి విచారణకు హాజరుకాబోతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన సిట్ కార్యాలయానికి చేరుకోనునున్నారు. ఇదే కేసులో మరో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు (Praneeth Rao)తో కలిపి ఆయనను విచారించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.

కాగా, బుధవారం సిట్ విచారణకు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao) హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి పలు అంశాలపై ఆయనను అధికారులు లోతుగా ప్రశ్నించారు. 2023 సాధారణ ఎన్నికలకు ముందు ఎస్ఐబీ (SIB) విభాగంలో కార్యకలాపాలు మొత్తం ప్రణీత్ రావు అధ్వర్యంలో కొనసాగాయి. దీంతో పలు పార్టీల నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీల ఫోన్లను ఆయన ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ప్రభాకర్ రావు వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన అధికారులు ఆయన ఇచ్చిన కీ డీటెయిల్స్ ఆధారంగా ప్రణీత్ రావుకు ప్రశ్నలు సంధించారు. ఫోన్ ట్యాపింగ్‌కు గురైన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ (Mahesh Kumar Goud)తో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి (Jaipal Reddy) సిట్ ఎదుట తమ హాజరై సాక్షులుగా తమ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story