- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడిలో విగ్రహాలు చోరీ చేసిన అక్కాచెల్లెల్లు.. కారణం తెలిసి ఆశ్చర్యపోయిన పోలీసులు
ఎస్ఆర్ నగర్ (SR Nagar) లోని ఓ గుడిలో శివ, పార్వతుల విగ్రహాల (Shiva Parvathi Idols) చోరీ కేసును (theft Case) పోలీసులు ఛేదించారు.

దిశ, వెబ్ డెస్క్: ఎస్ఆర్ నగర్ (SR Nagar) లోని ఓ గుడిలో శివ, పార్వతుల విగ్రహాల (Shiva Parvathi Idols) చోరీ కేసును (theft Case) పోలీసులు ఛేదించారు. ఈ కేసులో విగ్రహాలను ఎత్తుకెళ్లిన అక్కాచెల్లెల్లను (Sisters) అరెస్ట్ చేసిన పోలీసులు.. దొంగతనం చేయడానికి గల కారణం తెలుసుకొని ఆశ్చర్యపోయారు (Shock). హైదరాబాద్ (Hyderabad) ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని గురుమూర్తి నగర్ (Gurumoorthy Nagar) లో ఉన్న వినాయకుడి దేవాలయంలో (Ganesh Temple) శనివారం ఆలయ పూజారి టిఫిన్ చేసి వచ్చే సరికి గర్భ గుడిలోని శివ పార్వతుల పంచలోహ విగ్రహాలు (Panchaloha idols) మాయమయ్యాయి. దీంతో కంగారు పడిన పూజారి చోరీ ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టి సీసీ టీవీ ఫుటేజీ (CCTV Footage) ద్వారా దొంగతనం కేసును ఛేదించారు (cracked). గుడిలోని శివ పార్వతుల విగ్రహాలను స్వర్ణలత, పావని అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి, వారి నుంచి విగ్రహాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితురాళ్లను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో వాళ్ల ఇంట్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయని, విగ్రహాలను తెచ్చి పూజించాలని ఓ బాబా చెప్పారని తెలిపారు. దీంతో విగ్రహాలను కొనేందుకు వెళ్లగా.. తమ వద్ద ఉన్న డబ్బు సరిపోకపోవడంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులకు వివరించారు. దీంతో అక్కాచెల్లెల్లు చెప్పిన కారణాన్ని విని పోలీసులు ఆశ్చర్యపోయారు.






