ఈసీ గైడ్ లైన్స్ మేరకు ఎస్ఐఆర్ అమలు చేయాలి

by Naga Rani Yarlagadda |

ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కట్టుబడి ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక పునఃపరిశీలన (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్... ఎస్ఐఆర్) అమలు చేయాలని..

ఈసీ గైడ్ లైన్స్ మేరకు ఎస్ఐఆర్ అమలు చేయాలి
X
  • ఎస్ఐఆర్‌పై సీఈఓ సుదర్శన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కట్టుబడి ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక పునఃపరిశీలన (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్... ఎస్ఐఆర్) అమలు చేయాలని, ప్రతి దశలోనూ ఖచ్చితత్వం, జాగ్రత్త, సమయపాలన పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్రంలోని అన్ని ఇఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతితో పాటు పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను ఆయన సమీక్షించారు. ఎస్ఐఆర్‌కు సంబంధించిన పెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేసి, ఓటర్‌ జాబితా నాణ్యతను మరింత మెరుగుపర్చే దిశగా శ్రద్ధగా పనిచేయాలని సీఈఓ ఆదేశించారు. ఓటర్‌ జాబితా నవీకరణ, క్లెయిమ్‌లు–అభ్యంతరాల పరిష్కారం, ఫీల్డ్‌ ధృవీకరణ, డేటా ఎంట్రీ ఖచ్చితత్వం వంటి ముఖ్య అంశాలపై సీఈఓ అధికారులు నివేదికలు సమర్పించారు. ఖచ్చితమైన, లోపరహిత ఓటర్‌ జాబితా ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఈఓ హరి సింగ్, ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story