- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ఐఆర్ పెండింగ్ నివేదికలు పూర్తి చేయాలి
ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు సంబంధించిన పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి, ఓటర్ జాబితా మరింత మెరుగుపర్చే దిశగా శ్రద్ధగా పనిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు సంబంధించిన పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి, ఓటర్ జాబితా మరింత మెరుగుపర్చే దిశగా శ్రద్ధగా పనిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటరు జాబితా ఎస్ఐఆర్ పై రాష్ట్రంలోని ఇఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో సీఈవో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేయాలని, ప్రతి దశలోనూ ఖచ్చితత్వం, జాగ్రత్త, సమయపాలన పాటించాల్సిందేనని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను సమీక్షించారు. ఓటర్ జాబితా నవీకరణ, క్లెయిమ్‌లు–అభ్యంతరాల పరిష్కారం, ఫీల్డ్ ధృవీకరణ, డేటా ఎంట్రీ వంటి అంశాలపై అధికారులు సీఈఓకు నివేదికలు సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఈఓ హరి సింగ్, ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






