- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్లో SIR హెల్ప్ డెస్కులు.. ఓటర్ల మ్యాపింగ్‌కు విస్తృత చర్యలు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం భాగంగా ఓటర్ల జాబితా నవీకరణ కోసం విస్తృత చర్యలు చేపడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం భాగంగా ఓటర్ల జాబితా నవీకరణ కోసం విస్తృత చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు కమిషనర్/డీఈఓ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు అన్ని సంస్థలు, కాలనీ అసోసియేషన్స్, ఉద్యోగ సంఘాల కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (ఎలక్షన్స్) కె. చంద్రకళ, సీవీఓ అబ్దుల్ వకీల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 2002-2025మధ్యకాలానికి సంబంధించిన ఓటర్ల మ్యాపింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో సుమారు 200 మంది పాల్గొని, సంబంధిత బీఎల్ఓల ద్వారా మ్యాపింగ్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జీహెచ్ఎంసీ ఉద్యోగుల సంఘంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వారి కుటుంబ సభ్యులతో కలిపి ఓటర్ల మ్యాపింగ్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ఏసీ (అడ్మిన్) సత్యనారాయణ పాల్గొన్నారు. కేబీఆర్ పార్క్ వద్ద వాకర్స్ కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని పెంపొందించి, ప్రజలకు మెరుగైన ఎన్నికల సేవలు అందించడమే లక్ష్యమని ఏసీ(ఎలెక్షన్స్) చంద్రకళ తెలిపారు.






