- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మంత్రికి నల్లగొండ తప్ప ఏమీ తెలియదు: మాజీమంత్రి సింగిరెడ్డి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను 2014 వరకు ఎందుకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పూర్తి చేయలేదని.. కేసీఆర్‌ను తిట్టడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను 2014 వరకు ఎందుకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పూర్తి చేయలేదని.. కేసీఆర్‌ను తిట్టడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీపై అడ్డగోలుగా మాట్లాడారని.. ఆయనకు నీటి విలువ, నోటి విలువ తెలియదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టేందుకే అక్కడికి వెళ్లినట్లు ఉన్నదని ఆరోపించారు. నీళ్ల మంత్రికి నల్గొండ తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. పాలమూరు అల్లుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నీళ్ల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బయటకు వచ్చిందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు, రాష్ట్రం పరువు తీస్తున్నారని.. పాలమూరు-రంగారెడ్డిపై 190 కేసులు వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు పత్తిని తగలబెడుతున్నారని.. వరి ధాన్యం తడిసిపోయిందని అన్నారు. అయినా సీఎం, మంత్రులంతా జూబ్లీహిల్స్ ప్రచారంలోనే ఉండిపోతున్నారని పేర్కొన్నారు. రేవంత్‌కు ఓటమి భయం పట్టుకుందని.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె.కిషోర్‌గౌడ్ పాల్గొన్నారు.






