- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూలైన్లలో రైతులు.. స్టార్ హోటళ్లలో మంత్రులు : మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
రైతులు క్యూలైన్లలో అవస్థలు పడుతుంటే.. మంత్రులు మాత్రం స్టార్ హోటళ్లలో సేద తీరుతున్నారని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు క్యూలైన్లలో అవస్థలు పడుతుంటే.. మంత్రులు మాత్రం స్టార్ హోటళ్లలో సేద తీరుతున్నారని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. యూరియా అందుబాటులో పెట్టకుండా రైతులను నిందిస్తున్నారని పేర్కొన్నారు. యూరియా విషయంలో వ్యవసాయ మంత్రివి బరి తెగించిన మాటలని.. యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యమని ఫైర్ అయ్యారు. సీఎం యూరియా కొరత లేదంటారని.. కేంద్రం సరిపడా యూరియా ఇవ్వలేదని.. అందుకే కొరత అని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ మంత్రి యూరియా కోసం బజారుకెక్కిన వారు అసలు రైతులే కాదంటారని తెలిపారు. వీళ్లు సర్కారు నడుపుతున్నారా ? లేక సర్కస్ నడుపుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బస్తా యూరియా కోసం ఆధార్, పట్టాదార్ పాస్ బుక్కులు లైన్లో పెట్టి రైతన్నలు రోజుల తరబడి వానలో తడుస్తూ, నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. యూరియా అందుబాటులో పెట్టకుండా ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని పేర్కొన్నారు. వానాకాలం వ్యవసాయ అవసరాలు, సాగు, ఎరువులు, విత్తనాల డిమాండ్ మీద సరైన సమీక్ష లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలిపారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యవసాయ మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.






