- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బహుముఖ విస్తరణతోనే సింగరేణి భవిష్యత్
ప్రతి పనిలో పారదర్శకత ఉన్నప్పుడు విజిలెన్స్ అవసరం అంతగా ఉండదని, లోప భూయిష్టంగా వ్యవస్థ ఉన్నప్పుడు అక్రమాలకు, అవినీతికి ఆస్కారం ఉంటుందని సింగరేణి సంస్థ మాజీ సీఎండీ ఏపీవీఎన్శర్మ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి పనిలో పారదర్శకత ఉన్నప్పుడు విజిలెన్స్ అవసరం అంతగా ఉండదని, లోప భూయిష్టంగా వ్యవస్థ ఉన్నప్పుడు అక్రమాలకు, అవినీతికి ఆస్కారం ఉంటుందని సింగరేణి సంస్థ మాజీ సీఎండీ ఏపీవీఎన్శర్మ పేర్కొన్నారు. బుధవారం సింగరేణి భవన్ లో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి సంస్థలో పనిచేసిన కాలంలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి వివరిస్తూ సంస్థ ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వ్యాపార విస్తరణ చర్యలు చేపట్టడం హర్షణీయమన్నారు. రానున్న కాలంలో బొగ్గుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం తగ్గిపోతుందని, ఇప్పటికే కొన్ని విదేశాల్లో బొగ్గు తవ్వకాన్ని నిలిపివేశారని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు విస్తరించడం హర్షించదగిన విషయమని ప్రశంసించారు. అనంతరం సీఎండీ ఎన్.బలరామ్ ప్రసంగిస్తూ 1998 ప్రాంతంలో మూసివేతకు చేరువగా వెళ్ళిన సింగరేణి సంస్థకు తిరిగి ప్రాణ ప్రతిష్ట చేసిన గొప్ప అధికారి ఎ.పి.వి.ఎన్.శర్మ అని ప్రశంసించారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఒడిశా రాష్ట్రంలో బొగ్గు బ్లాక్ ను ప్రారంభించిందని, రాజస్థాన్ రాష్ట్రంతో కలిసి సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో బంగారం, రాగి అన్వేషణ జరుపుతోందని, ఈ విధంగా బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలతో సింగరేణి గ్రీన్ ఎనర్జీ సంస్థగాను, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ సంస్థగా విస్తరించనుందన్నారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమల రావు, పలువురు అధికారులు శర్మ సేవలను గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో జీఎం టి.శ్రీనివాస్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలు, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.






