కార్మికులకు సింగరేణి సంస్థ శుభవార్త

by Gantepaka Srikanth |
కార్మికులకు సింగరేణి సంస్థ శుభవార్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థలో 2023- 24 ఆర్థిక సంవత్సరంలో, ఏప్రిల్ 1, 2024 నుంచి సెప్టెంబరు 30, 2024 మధ్యలో పనిచేసి పదవి విరమణ పొందిన అధికారులు, కార్మికులకు సంబంధించిన లాభాల వాటా సొమ్మును విడుదల చేసేందుకు ఆదేశాలను జారీ చేసినట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12న వారి ఖాతాల్లో బోనస్ సొమ్ము జమ అవుతుందని పేర్కొన్నారు. పదవి విరమణ పొందిన 2035 మంది కార్మికులకు లాభాల వాటా కింద మొత్తం 33 కోట్ల రూపాయలను విడుదల చేశామని వెల్లడించారు. ఈనెల 12న రిటైర్డు కార్మికుల ఖాతాల్లో జమ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, సిబ్బంది వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులను ఈ మేరకు ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed