- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం
రాష్ట్రంలోని ఆరు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఈడీ బుధవారం సోదాలు చేయడం తీవ్ర కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. బుధవారం ఉదయం 15 బృందాలు హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కామినేని, ఎన్వీఎస్, ప్రతిమ గ్రూప్ సంస్థలతో పాటు మొత్తం ఆరు మెడికల్ కాలేజీల్లో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో అవకతవకలపై వచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సోదాల్లో ఎటువంటి సమాచారం రాబట్టబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఈడీ ఎంట్రీతో ఈ సంస్థల్లో మనీలాండరింగ్ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Next Story






