- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ చిచ్చు!
బీఆర్ఎస్ రజతోత్సవ సభను గ్రాండ్ గా నిర్వహించాలని భావిస్తున్న కేసీఆర్ కు సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు షాకిస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: వరుస ఓటములతో డీలాపడ్డ క్యాడర్ లో తిరిగి కొత్త ఉత్సాహం నింపాలని చూస్తున్న బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ ఆశలపై సొంత పార్టీ నేతలు నీళ్లు చల్లుతున్నారు. ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ పాతికేళ్ల ప్రస్థానం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఈ మేరకు ఈ రజతోత్సవ సభకు ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు ఈ సభ వరంగల్ బీఆర్ఎస్ ముఖ్యనేతల మధ్య చిచ్చు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సత్యవతి రాథోడ్ (Satyavathy Rathod) తీరుపై రవీందర్ రావు (MLC Thakkellapally Ravinder Rao) బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు.
ఇదేం తీరు?
బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్ జిల్లా (Warangal) సమన్వయ కర్తగా సత్యవతి రాథోడ్ కు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. నేతలందరినీ కలుపుకుని పోవాలని అధినేత ఆదేశించినా సత్యవతి రాథోడ్ సమన్వయం చేయడంలో విఫలం అవుతున్నారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ మంత్రి తీరును బహిరంగంగా విమర్శించారు. ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరించడం సరైనది కాదని సమన్వయ కర్తగా సత్యవతి రాథోడ్ పార్టీ శ్రేణులను అందరినీ కలుపుకుని పోవాలన్నారు. కలిసి పనిచేయమని కేసీఆర్ ఆదేశిస్తే సత్యవతి రాథోడ్ నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ లేదని, సత్యవతి రాథోడ్ ఈ రకంగా వ్యవహరించడం సరైనది కాదని మండిపడ్డారు. ఐక్యత లోపం కనిపిస్తోంది. ఎన్నికల్లో ఈ జిల్లా వైఫల్యానికి నేతల మధ్య ఐక్యత లేకపోవడమేనన్నారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకునే పార్టీ నాయకత్వ లేమి ఇక్కడ ఉందన్నారు. అధిష్టానం ఆదేశాలు అందరూ పాటించాలని, ఎంతో నమ్మకంతో అధిష్టానం ఆమెకు ఈ బాధ్యత అప్పగించిందన్నారు. ఈ రకంగా వ్యవహరిస్తే పార్టీ నష్టపోతుందన్నారు.
కేసీఆర్ క్లాస్ తీసుకున్నా మారని తీరు:
పార్టీ రజతోత్సవ సభ అవకాశాన్ని కేసీఆర్ ఉమ్మడి వరంగల్ కు ఇచ్చారు. గతంలో పార్టీని గొప్పగా ఆదరించిన ఈ జిల్లాలోనే బహిరంగ సభ పెట్టాలని గులాబీ బాస్ నిర్ణయించగా జిల్లా నేతల మధ్య ఆధిపత్య పోరు కేసీఆర్ కు చిర్రెత్తుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సభా స్థలి ఎంపిక నాటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య సమన్వయలోపం కనిపిస్తోందని కేసీఆర్ గ్రహించారని దీంతో నేతల తీరుపై ఇప్పటికే ఓ సారి క్లాస్ తీసుకున్నట్లు టాక్ వినిపించింది. తీరు మార్చుకోవాలని అందరూ కలిసి సమిష్టిగా పని చేయాలని సూచించారని ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ ఉపదేశంతో అంతా సద్దుమణుగుతుందనుకునే లోపు సత్యవతిరాథోడ్ తీరుపై ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బహిరంగంగా చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సభ జరుగుతున్న జిల్లా నేతలు ఇలా విభేదించుకుంటే భారీ సంఖ్యలో జనసమీకరణ చేస్తే అక్కడ వారికి కల్పించే సౌకర్యాలు, సభ సక్సెస్ ఎలా అనేది గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఓ వైపు సభా తేదీ దగ్గరపడుతున్న వేళ వరంగల్ జిల్లా నేతల మధ్య మాత్రం విభేదాలు తారాస్థాయికి చేరడం కారు పార్టీలో కంగారుగా మారుతోంది.






