- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sigachi: పాశమైలారం ఘటన.. 41కి చేరిన మృతుల సంఖ్య
పాశమైలారం (Pasha Mailaram) సిగాచీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతు సంఖ్య నేటితో 41కి చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: పాశమైలారం (Pasha Mailaram) సిగాచీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతు సంఖ్య నేటితో 41కి చేరింది. ఇవాళ ఉదయం ధ్రువ ఆసుపత్రిలో తీవ్రంగా కాలిన గాయాలతో జితేందర్ (Jitender) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదేవిధంగా ఘటనా స్థలంలో మరో మృతదేహం వివరాలను అధికారులు గుర్తించారు. అయితే, ప్రమాదంలో గల్లంతైన మరో తొమ్మిది మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. దీంతో బాధిత కుటుంబాలు తమ వారి మృతదేహాల కోసం పటాన్‌చెరు (Patancheru) ప్రభుత్వాసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆసుపత్రిలో ఉన్న 9 మంది క్షతగాత్రుల్లో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా.. మిగిలిన ఆరుగురిలో 40 నుంచి 80 శాతానికి పైగా కాలిన గాయాలైన ముగ్గురికి వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అదజేస్తున్నారు.






