ఆకట్టుకున్న కానుక.. మంత్రి హారీశ్ రావుకు సిద్దిపేట కలెక్టర్ అదిరిపోయే గిఫ్ట్

by Disha Web Desk 7 |
ఆకట్టుకున్న కానుక.. మంత్రి హారీశ్ రావుకు సిద్దిపేట కలెక్టర్ అదిరిపోయే గిఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : బంధు, మిత్రుల ఇళ్లలో శుభకార్యాలు జరిగినా.. సెలబ్రేషన్స్ జరిగినా గిఫ్ట్ తీసుకెళ్లి ఇవ్వడం సహజం. అది ఎలాంటి గిఫ్ట్ అనేది ఎదుటి వ్యక్తి అభిరుచులకు అనుగుణంగా ఉంటుంది. తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొంతమంది పూల బొకేలతోపాటు వివిధ రకాల బహుమతులను మంత్రికి అందజేస్తున్నారు.

ఈక్రమంలో సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ (Collector Prashanth Jeevan Patil) వినూత్నంగా ఆలోచించి మంత్రికి అదిరిపోయో గిఫ్ట్ ఇచ్చారు. భావితరాలకు ఉపయోగపడేలా ఉండే మొక్కను మంత్రికి అందజేసి హరీశ్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్పైడర్ ప్లానెట్‌( Spider Plants)గా పిలువబడే ఈ మొక్కను బెడ్ రూంలలో పెంచుకుంటారు. పూర్వకాలం నుంచి ఈ మొక్కను పెంచుకోవడం స్టేటస్ సింబల్‌గా వస్తుంది. దీనిని క్లోరోఫైటమ్ కోమోసమ్ (Chlorophytum comosum) అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఇంటి పరిసరాలను ఆకర్షణీయంగా ఉంచడంతోపాటు ఆహ్లాదకమైన గాలిని అందిస్తుంది. ప్రస్తుతం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అందించిన ఈ గిఫ్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

Next Story