- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీకి బీఆర్ఎస్ భయపడింది... అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు
బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చ జరిగింది. రాహుల్ గాంధీ బలహీన వర్గాల అండగా ఉన్నారని,మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బలహీనవర్గాల పక్షాన నిలడ్డ వ్యక్తి, తప్పును సరిచేయాలని ముందుకొచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ శాసనసభలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన కలిసి పోరాటం చేయాలనుకుంటే మాతో కలిసి రావాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మేము ఢిల్లీలో పోరాటం చేస్తుంటే బీజేపీకి భయపడి బీఆర్ఎస్ మాతో కలిసి రాలేదని విమర్శించారు.
పోరాటం చేశాం ఇంకా చేస్తూనే ఉంటాం:
డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేసి కోర్టు తీర్పుకు అనుగుణంగా ఒక ప్రయత్నం చేశామన్నారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్‍లో పర్యటించిన సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై పోరాటం చేస్తామని చెప్పారు. అందుకోసం అనుగుణంగా మా ప్రయత్నం మేము చేశాం. చేస్తూనే ఉంటామన్నారు. ఎన్డీయే కూటమి సభ్యులు సైతం రాష్ట్రపతి వద్దకు వెళ్లి బీసీ రిడర్వేషన్ల అంశంపై ప్రయత్నం చేశామన్నారు. అంతే తప్ప మా పోరాటాన్ని మా కమిట్‍మెంట్‍ను శంకించాల్సిన అవసరం లేదన్నారు.






