Shravan Dasoju : బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై దాడి.. శ్రవణ్ దాసోజు హాట్ కామెంట్స్

by Muthe.Rajitha |

యాదాద్రి-భువనగిరి(Yadadri Bhuvangiri) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం(BRS Party Office)పై నేడు యూత్ కాంగ్రెస్ లీడర్లు దాడికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ నేత డా. శ్రవణ్ దాసోజు(Dr. Sravan Dasoju) తీవ్రంగా ఖండించారు.

Shravan Dasoju : బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై దాడి.. శ్రవణ్ దాసోజు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి-భువనగిరి(Yadadri Bhuvangiri) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం(BRS Party Office)పై నేడు యూత్ కాంగ్రెస్ లీడర్లు దాడికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ నేత డా. శ్రవణ్ దాసోజు(Dr. Sravan Dasoju) తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ, ప్రజల హక్కులను ప్రశ్నించే వారిపై దౌర్జన్యానికి దిగడం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలోని ప్రభుత్వ విష సంస్కృతిని స్పష్టంగా చూపిస్తుందని మండిపడ్డారు. హోం శాఖ తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి.. ప్రతి సందర్భంలోనూ హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడటం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విధ్వంసక చర్యలకు తెలంగాణలో ఎక్కడైనా స్థానం ఉండకూడదని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక చర్యలు సహించలేమని తెలియ జేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, తప్పు చేసిన వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, ఆంధ్ర పాలక వర్గాలపై కేసీఆర్ నాయకత్వంలో చేసిన పోరాటం స్పూర్తిగా, రేవంత్ రెడ్డి విధ్వంసక చర్యలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నట్టు శ్రవణ్ పేర్కొన్నారు.

Next Story