- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతరావుకు షోకాజ్ నోటీసులు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతరావు కు బుధవారం షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. పార్టీ పదవులు విషయంలో ఆమె ఇటీవలే కొంతమంది మహిళా నేతలతో కలిసి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ వ్యతిరేకంగా గాంధీ భవన్లో బైఠాయించి ధర్నా చేపట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతరావుకు బుధవారం షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. పార్టీ పదవుల విషయంలో ఆమె ఇటీవలే కొంతమంది మహిళా నేతలతో కలిసి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ వ్యతిరేకంగా గాంధీ భవన్లో బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈనేపథ్యంలో బుధవారం మొగిలి సునీత రావుకు ఆ పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కలాంబ షోకజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసుకు సంబంధించి వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కన్నారు.
కాగా, సునీతా రావు ఇటీవల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యతిరేకంగా గాంధీభవన్లో ఆందోళనకు దిగారు.. పీసీసీ చీఫ్ తమ కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెడుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పార్టీలో సముచిత న్యాయం కల్పించి నామినేటెడ్ పదవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సునీతరావుకు వ్యతిరేకంగా మంగళవారం గాంధీభవన్లో గోషామహల్ నియోజకవర్గ మహిళా నేతలు నిరసన చేపట్టారు. ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖను కూడా రాశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ అధ్యక్షురాలు అల్కలాంబ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీలో క్రమశిక్షణ సంబంధించి తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ఈ విషయంలో వారం రోజుల్లో గా వివరణ ఇవ్వాలని ఆమె ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.






