- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ‘స్వర్గసీమ అమేయ’ ప్రాజెక్టుకు షోకాజు నోటీసులు
రిజిస్ట్రేషన్ నంబరు పొందుపరచని చట్టవిరుద్ధమైన ప్రకటనలు చేస్తున్న స్వర్గసీమ అమేయ ప్రాజెక్టుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి ఆథారిటీ(టీజీ రెరా) షోకాజు నోటీసులు జారీచేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రిజిస్ట్రేషన్ నంబరు పొందుపరచని చట్టవిరుద్ధమైన ప్రకటనలు చేస్తున్న స్వర్గసీమ అమేయ ప్రాజెక్టుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి ఆథారిటీ(టీజీ రెరా) షోకాజు నోటీసులు జారీచేసింది. నిబంధనలు ఉల్లంఘించిన మరిన్ని సంస్థలకు సైతం రెరా నోటీసులు జారీచేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేసింది. ఇల్లు/ప్లాట్/యూనిట్ అమ్మకాలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రిజిస్ట్రేషన్ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయద్దని ప్రమోటర్లు/డెవలపర్‌లను తెలంగాణ రెరా అథారిటీ హెచ్చరించింది. రెరా చట్టం ప్రకారం 500 చదరపు మీటర్లు దాటితే మరియు 8 కంటే ఎక్కువ యూనిట్లు కలిగి ఉన్న ప్రతి ప్రాజెక్టును ముందుగా తెలంగాణ రెరాలో రిజిస్టర్ చేయాలని, రెరా అథారిటీ ప్రాజెక్టు వివరాలను పరిశీలించి, రిజిస్ట్రేషన్ నంబరును మంజూరు చేసిన తర్వాతే ఆ నంబరు ద్వారా అమ్మకాలపై ప్రకటనలు చేయాలని ప్రమోటర్లు/డెవలపర్‌లను సూచించింది.
కఠిన చర్యలు..
ఇందులో భాగంగా ఇటీవల రిజిస్ట్రేషన్ నంబరు పొందుపరచని చట్టవిరుద్ధమైన ప్రకటనలు రెరా దృష్టికి రావడంతో ఆయా ప్రాజెక్టు సంస్థలకు రెరా అథారిటీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. గోద్రెజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్టు, వర్టెక్స్ విరాట్ ప్రాజెక్టు, స్వర్గసీమ అమేయ ప్రాజెక్టు, తిరుమల హిల్స్ మొదలగు రియల్ ఎస్టేట్ కన్ స్ట్రక్షన్ కంపెనీలు ఇందులో ఉన్నాయి. కొన్ని కన్ స్ట్రక్షన్ కంపెనీలు రెరా రిజిస్ట్రేషన్ నంబరును పొందుపరిచినప్పటికీ, ఆ ప్రకటన రెరా నిబంధనల మేరకు లేనట్టుగా అథారిటీ గుర్తించింది. స్వర్గసీమ కన్ స్ట్రక్షన్ వారి అమేయ ప్రాజెక్టు ప్రకటనలో అక్షరాల సైజు, ప్రాజెక్టు పూర్తిపేరు, లేఅవుట్ గా రిజిస్టర్ చేసి, ప్రకటన మాత్రం పూర్తి రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా చూపిస్తూ కొనుగోలుదారులను తప్పు దోవ పట్టించడం లాంటి ఉల్లంఘనలను గమనించిన రెరా, ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రెరా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.






