బతుకమ్మపై షార్ట్ ఫిల్మ్ పోటీలు.. యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్‌కు ఛాలెంజ్.. రూ. 3 లక్షల ప్రథమ బహుమతి

by Ramesh Naini |

తెలంగాణ‌లోని యువ సృజ‌న‌శీలుర‌కు ప‌ట్టం క‌ట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వ‌హిస్తోంది.

బతుకమ్మపై షార్ట్ ఫిల్మ్ పోటీలు.. యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్‌కు ఛాలెంజ్.. రూ. 3 లక్షల ప్రథమ బహుమతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ‌లోని యువ సృజ‌న‌శీలుర‌కు ప‌ట్టం క‌ట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ #TGFDC బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ పేరిట షార్ట్ ఫిలిమ్స్ (Short film) పోటీలు నిర్వ‌హిస్తోంది. 3 నిమిషాలు, 5 నిమిషాల లోపు నిడివి కలిగిన రెండు కేటగిరీల్లో షార్ట్ ఫిలిమ్స్ పంపించాలని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి, ఇందిర‌మ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త‌దిత‌రాలు), తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌ల పోటీలు పంపించాలి. సెప్టెంబర్ 30 లోపు ఎంట్రీలను పంపించాల్సి ఉంటుందని, నిర్దేశిత గడువులోగా అందిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి ఎంపిక చేస్తారని దిల్ రాజు వెల్లడించారు. ఈ పోటీల్లో పాల్గొనే వారికి భవిష్యత్తులోనూ అనేక రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం దిల్ రాజు విడుదల చేశారు.

ఎంట్రీల‌ను ఈ కింది మెయిల్ ఐడీ [email protected] లేదా వాట్సాప్ నెంబర్ - 8125834009 (WhatsApp Only) కు పంపించాల్సి ఉంటుంది. పోటీలో ఎంపికైన షార్ట్ ఫిలిమ్స్‌కు ప్రథమ బహుమతి రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. 1 లక్ష చొప్పున అందిస్తారు. మరో ఐదుగురికి రూ. 20 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు అందజేస్తారు. వీటితో పాటు బహుమతి గ్రహీతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను ప్రదానం చేస్తారు.

పోటీలో పాల్గొనడానికి అర్హతలు:

1. ఈ పోటీలో పాల్గొనే వారి వయసు 40 ఏళ్ల లోపు ఉండాలి.

2. 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.

3. షార్ట్ ఫిల్మ్స్ / వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీల్లో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.

4. మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.

5. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ కోసం మాత్రమే చిత్రీకరించినవై ఉండాలి.

Next Story