ఎల్ఎండీ గేట్ల వద్ద షూటింగ్ సందడి

by Elthuri vijay kumar |

సందడి చేసిన హీరో శ్రీకాంత్, హీరోయిన్ లయ

ఎల్ఎండీ గేట్ల వద్ద షూటింగ్ సందడి
X

ఎల్ఎండీ గేట్ల వద్ద షూటింగ్ సందడి

-సందడి చేసిన హీరో శ్రీకాంత్, హీరోయిన్ లయ

-భారీగా తరలివచ్చిన ప్రజలు

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్‌లోని లోయర్ మానేరు జలాశయం (LMD) ఎప్పుడూ పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం. ఇక్కడి అద్భుత దృశ్యాలు, ప్రకృతి సోయగాలు చూసి చాలామంది మంత్రముగ్ధులవుతుంటారు. అయితే ఈసారి మాత్రం అక్కడి స్పిల్‌వే గేట్లపై సినిమా షూటింగ్ సందడి నెలకొంది. బ్లూ జే మూవీస్ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న "ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా" అనే చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు ప్రస్తుతం LMD వద్ద చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరోగా శ్రీకాంత్, హీరోయిన్‌గా లయ నటిస్తున్నారు. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి, నిర్మాత చందు వెంకటేష్ పర్యవేక్షణలో ఈ షూటింగ్ జరగుతోంది. మొత్తం 10 రోజుల పాటు కరీంనగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ కొనసాగుతుందని చిత్ర బృందం తెలిపింది. స్థానికులు షూటింగ్ చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Next Story