- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లేడీస్ బీ అలర్ట్.. ప్రాణం మీదకు తెచ్చిన ముక్కుపుడక! వైరల్ అవుతున్న షాకింగ్ ఎక్స్‌రే
భారతీయ సంప్రదాయంలో స్త్రీలకు ముక్కుపుడక ఒక ప్రత్యేకమైన అందం. ఇది ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఆ అందమే ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ సంప్రదాయంలో స్త్రీలకు ముక్కుపుడక ఒక ప్రత్యేకమైన అందం. ఇది ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఆ అందమే ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. చిన్న అజాగ్రత్త ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో తెలిపే ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఒక మహిళ ముక్కుపుడక పెట్టుకుంది కానీ, దాని వెనుక ఉండే పిన్ (Screw)ను సరిగ్గా బిగించుకోలేదు. అది లూజుగా ఉండటంతో ఆమె గమనించలేదు. గాలి పీల్చుకునే క్రమంలో ఆ ముక్కుపుడక పిన్ కాస్త ఊడిపోయి, పొరపాటున ముక్కులో నుంచి నేరుగా ఊపిరితిత్తుల్లోకి (Lungs) జారిపోయింది. దీంతో ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది.
వైరల్ అవుతున్న ఎక్స్‌రే..
బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి పరీక్షించగా అసలు విషయం బయటపడింది. ఆమె ఊపిరితిత్తుల్లో ఆ చిన్న పిన్ ఇరుక్కుని ఉన్నట్లు ఎక్స్‌రేలో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోను చికిత్స చేసిన డాక్టర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందించి ప్రమాదాన్ని నివారించారు. ఈ ఘటన నేపథ్యంలో వైద్యులు మహిళలకు కీలక సూచనలు చేస్తున్నారు.
అందం ఎంత ముఖ్యమో.. ఆరోగ్యం కూడా!
ముక్కుపుడకలు, చెవి రింగులు వంటి చిన్న ఆభరణాలు ధరించేటప్పుడు వాటి స్క్రూలు టైట్‌గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ముఖ్యంగా పడుకునేటప్పుడు లేదా స్నానం చేసేటప్పుడు ఇవి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం శ్వాసకోశ సంబంధిత సమస్యలకు లేదా ప్రాణాపాయానికి దారితీయవచ్చు. కాబట్టి, మహిళలూ.. అందం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. ముక్కుపుడక విషయంలో ఇకనైనా జాగ్రత్త పడాలని వైరల్ అవుతున్న వీడియోలో డాక్టర్ సలహా ఇచ్చారు.






