- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కన్న తండ్రి దారుణం.. పశువుల కాపరి రాకతో పరార్
కన్నకూతురిపై ఓ తండ్రి దాష్టీకానికి తెగబడ్డాడు. చిన్నారి అరుపులు విని పశువుల కాపరి రాకతో ఈ విషయం వెలుగు చూసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: చిన్న పిల్లలు అల్లరి చేయడం, మాట వినకపోవడం సహజమే. కానీ మాట వినడం లేదన్న కోపంతో ఆరేళ్ల కూతురి పట్ల రాక్షసంగా వ్యవహరించాడో కన్న తండ్రి. పశువుల కాపరి రాకతో సీన్ మొత్తం రివర్స్ కావడంతో అక్కడి నుంచి పరారైయ్యాడు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిందని ప్రచారం జరుగుతున్న ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
పశువుల కాపరి రాకతో..
తన మాట వినడం లేదని సరిగా చదవడం లేదని సతీశ్ అనే వ్యక్తి తన కూతురుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి చితకబాదాడు. తండ్రి దెబ్బలకు తాళలేక ఆ పసిబిడ్డ కేకలు వేస్తూ విలవిలలాడిపోయింది. అయినా ఆ తండ్రి మనసు కనికరం చూపలేదు. విచక్షణారహితంగా కొట్టాడు. ఈ క్రమంలో చిన్నారి అరుపులు విన్న ఓ పశువుల కాపరి.. అక్కడికి వెళ్లి తండ్రిని నిలదీశాడు. దీంతో నా బిడ్డను నేను బెదిరించుకుంటున్నానని తండ్రి నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. నీ బిడ్డను బెదిరించుకో కానీ ఇంటి వద్ద బెదిరించాలని ఈ నిర్మానుష్య ప్రాంతంలో ఇదేం పని అని పశువుల కాపరి మండిపడటంతో ఇంటి వద్ద వినడం లేదంటూ తన బైక్ పై పాపను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
కఠినంగా శిక్షించాలని డిమాండ్:
ఈ తతంగానికి అంతా సదరు పశువుల కాపరి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తండ్రి సతీశ్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చిన్నారిని విచక్షణ రహితంగా కొట్టిన సతీశ్‍పై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






