- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గర్భవతైన భార్యను ముక్కలుగా నరికిన భర్త.. సంచలన విషయాలు బయటపెట్టిన తల్లి..
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ లోని బాలాజీ హిల్స్ లో జ్యోతి (21) అనే గర్భిణీ స్త్రీ ని భర్త అతి కిరాతకంగా చంపి, ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ లోని బాలాజీ హిల్స్ లో జ్యోతి (22) అనే గర్భిణీ స్త్రీ ని భర్త అతి కిరాతకంగా చంపి, ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. పెద్దల్ని కాదని మహేందర్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న జ్యోతికాపురం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిందని ఆమె తల్లి మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. మహేందర్ గురించి ఆమె షాకింగ్ విషయాలు బయటపెట్టారు. పెళ్లై 19 నెలలు గడిచినా.. ఒక్కసారి కూడా మహేందర్.. జ్యోతిని పుట్టింటికి పంపలేదని వాపోయారు.
భర్తకు తెలియకుండా తమ కూతురు అప్పుడప్పుడు తమతో ఫోన్లో మాట్లాడేదని, పెళ్లైన కొన్నాళ్లకే మహేందర్ వేధించడం మొదలు పెట్టాడని చెప్పేదన్నారు. మహేందర్ రెడ్డి ప్రవర్తనపై చుట్టుపక్కల వారు కూడా అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతుర్ని చెప్పి మరీ చంపేశారని జ్యోతి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముక్కలు చేసిన శరీర భాగాల్లో కొన్నింటిని మూసీ నదిలో పడేసినట్లు మహేందర్ పోలీసులకు చెప్పగా.. వాటి కోసం ప్రతాప్ సింగారం సమీపంలో నదిలోగాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్ సైకోలా ఎందుకు మారాడు? జ్యోతిని చంపేంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ? జ్యోతి హత్యకు దారితీసిన కారణాలేంటి? అనే వివరాలు పోలీసుల పూర్తి విచారణలో తేలాల్సి ఉంది.






