- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోనస్ రాదని డిసైడ్ అయిపోవాలా?.. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల షాకింగ్ కామెంట్స్
యాసంగి ధాన్యం అమ్మిన రైతులు బోనస్ సొమ్ముపై ఆశలు వదులుకోవాల్సిందేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి ధాన్యం అమ్మిన రైతులు బోనస్ సొమ్ముపై ఆశలు వదులుకోవాల్సిందేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేసి 20 రోజులు గడవగా అమ్మిన వడ్లకే రైతుల ఖాతాల్లో డబ్బులు వేశారు. కానీ బోనస్సొమ్ము మాత్రం జాడలేదు. కేంద్రాల్లో బాధ్యతలు నిర్వహించే వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే బోనస్వేసినప్పడే తమ సొమ్ము అనుకోవాలని, పూర్తిగా దానిపై ఆశలు పెట్టుకోవద్దని చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతేడాది యాసంగి సీజన్‌లో బోనస్ఎవరికి వేయలేదని, ఈసారి కూడా కష్టమేనని అన్నదాతలకు చెబుతున్నట్టు తెలిసింది. బోనస్పథకం వానాకాలం సీజన్‌కే పరిమితం కావొచ్చని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పట్టించుకోవట్లేదు..
బోనస్పంపిణీతో సన్నాలు పండించిన రైతులంతా ప్రైవేటు మిల్లర్లకు అమ్మకాలు చేయకుండా ఆలస్యమైన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేస్తున్నారు. తాలు, తరుగు, రంగు మారిందని సాకులు చూపి బస్తాకు రెండు కిలోల కోత పెట్టిన బోనస్రూపంలో గిట్టుబాటు అవుతుందని ఆశిస్తే యాసంగి సీజన్బోనస్పంపిణీ అనేది ఉత్తమాటే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్మాటలు నమ్మి దొడ్డు రకాలు తగ్గించి సన్న రకాలు సాగు చేస్తే చివరికి బోనస్ప్రభుత్వం ఎగొట్టే ప్రయత్నాలు చేయడం రైతు వ్యతిరేకత తప్పదని హెచ్చరిస్తున్నారు. గత యాసంగిలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4.09 లక్షల మంది రైతుల నుంచి 23.19 లక్షల టన్నుల సన్నరకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. క్వింటాకు రూ.500 చొప్పున రూ.1,159.64 కోట్లు చెల్లించాల్సివుంది. గత ఏప్రిల్, మే నెలల్లో ధాన్యం కొనుగోలు చేయగా జూలై ఖాతాలో జమ అవుతుందని భావించారు. కానీ వానాకాలం సీజన్వచ్చిందని, బోనస్ఇవ్వాలని రైతులు డిమాండ్చేసినా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.
క్లారిటీ లేదు..
ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నా.. రైతులు ఎక్కువగా దొడ్డు రకాలే సాగు చేస్తున్నారు. దీంతో పేదలకు సన్నబియ్యం నిల్వలు సరిపడ ఉండాలంటే సన్నాల సాగు పెరగాలి. అందుకోసం సర్కార్రైతులను ప్రోత్సహించేందుకు సన్నాలకు రూ.500 బోనస్‌ఇస్తామని ప్రకటించింది. దీంతో రైతులు దొడ్డు రకాలు తగ్గించి సన్నాల వైపు మొగ్గు చూపారు. మొదటి పంటకు రైతుల ఖాతాలో బోనస్జమ చేయడంతో రెండోపంట కూడా సన్నాలు వేశారు. కేంద్రాల్లో అమ్మకాలు చేసిన బోనస్పంపిణీ జరగలేదు. ప్రభుత్వం బోనస్ప్రకటన సమయంలో ఏ సీజన్‌లో, ఎన్ని సంవత్సరాలు, అనే విషయం స్పష్టంగా చెప్పలేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన సీజన్‌కే బోనస్వర్తిస్తోందని, ప్రతి సీజన్ఇవ్వాలనే ఆదేశాలు లేవంటున్నారు. సర్కార్ఖజానా నిండుగా ఉంటేనే ఈ యాసంగి సీజన్బోనస్ రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉందంటున్నారు.
ప్రైవేటు మేలు..
ఈ సీజన్‌లో బోనస్జమ కాకపోవడంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర కంటే రూ.200 తక్కువకు కొనుగోలు చేసిన వ్యాపారులు.. పచ్చి ధాన్యం, తాలు, రంగు మారిందనే సాకులు లేకుండా వెంటనే తూకం వేసి పదిరోజుల్లో నగదు చేతిలో పెడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం, పచ్చి ధాన్యం పేరుతో తూకం వేయకుండా సాగదీస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు ప్రశ్నిస్తే.. తూకం వేసి, లారీలో లోడ్‌చేసి, మిల్లలకు పంపితే అక్కడ మిల్లర్లు ధాన్యం దించుకోకుండా నాణ్యత పేరుతో కుట్రలకు పాల్పడుతున్నారు. కేంద్రాల నిర్వహకులు చెప్పినట్టు బస్తాకు రెండుకిలోల తరుగుకు ఒప్పుకుంటే ధాన్యం సొమ్ము ఖాతాలో జమ అవుతుంది. లేకుంటే రోజల తరబడి మిల్లుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకే అమ్మడం ఉత్తమమని రైతులు భావిస్తున్నారు.






