IPL 2026: ఐపీఎల్ అభిమానులకు షాక్.. భారీగా పెరిగిన SRH - RCB మ్యాచ్ టికెట్ ధరలు

by Prasad Jukanti |

మే 22న ఉప్పల్‌లో జరగబోయే SRH vs RCB మ్యాచ్ టికెట్ల ధరలను సన్‌రైజర్స్ యాజమాన్యం భారీగా పెంచడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

IPL 2026: ఐపీఎల్ అభిమానులకు షాక్.. భారీగా పెరిగిన SRH - RCB మ్యాచ్ టికెట్ ధరలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో క్రేజ్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ టికెట్ల విక్రయాలు ఉప్పల్ స్టేడియం వేదికగా మరోసారి వివాదానికి దారితీశాయి. మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌ టికెట్ల ధరలు భారీగా పెంచడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్నారని సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అధికారిక టికెటింగ్ భాగస్వామి 'డిస్ట్రిక్ట్' (District) యాప్‌లో బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం టికెట్ల ధరలు సాధారణం కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో దర్శనమివ్వడం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది.

రూ.950 టికెట్ రూ.2000

రూ.950 టికెట్ ధర ఏకంగా రూ. 2000కు పెరిగింది. రూ.1500 ఉన్న టికెట్ రూ.3000కు రూ.1910 ఉన్న టికెట్ రూ.3500, రూ.2500 ఉన్న టికెట్ రూ.4500, రూ.4500 ఉన్న టికెట్ రూ.6000, రూ.7000 ఉన్న టికెట్ ధర రూ.10 వేలు, రూ.23 వేలు ఉన్న బాక్స్ టికెట్ ధర రూ.30 వేల రూపాయలకు, రూ. 30 వేలు ఉన్న కార్పోరేట్ బాక్స్ టికెట్ ధర రూ.45 వేలకు పెరిగాయి.

క్యూ లో 2.6 లక్షల మంది ఫ్యాన్స్

ఇవాళ టికెట్ల విక్రయాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే యాప్‌లో క్యూ లైన్ ఏకంగా 2.6 లక్షల మార్కును దాటేసింది. ఉప్పల్ స్టేడియం సామర్థ్యమే సుమారు 39 వేల సీట్లు అయితే, లక్షల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ చూపిస్తే అసలు సాధారణ అభిమానులకు టికెట్లు ఎలా దొరుకుతాయని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన కాసేపటికే 'సోల్డ్ ఔట్' (Sold Out) బోర్డులు పెట్టేసి.. ఈ టికెట్లన్నింటినీ తెరవెనుక బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Next Story