- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sabitha Indra Reddy: మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి షాక్!
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) కేసులో కీలక మలుపు తిరింగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఓబులాపురం మైనింగ్ కంపెనీ (Obulapuram Mining Case) కేసులో కీలక మలుపు తిరింగింది. ఈ కేసులో మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందం నిర్దోషులుగా పేర్కొంటూ నాంపల్లి సీబీఐ (CBI) ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. దీంతో ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐని దర్యాప్తుకు ఆదేశించిది. 2011లో సీబీఐ మొదటి చార్జి షీట్ దాఖలు చేసింది. దాదాపు 15 ఏళ్ల పాటుసాగిన ఈ విచారణలో ఈ ఏడాది మార్చి 6వ తేదీన నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడిస్తూ ఈ కేసులో ప్రధాన నిందితులైన ఓఎంసీ అప్పటి డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి జనార్ధన్ రెడ్డి పీఏ మహఫూజ్ అలీ ఖాన్ లను దోషులుగా నిర్ధారిస్తూ వారికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల చొప్పున, ఓఎంసీకీ రూ. 2 లక్ష జరిమానా విధించింది. ఆరోపణలు ఎదుర్కొన్న సబితా ఇంద్రారెడ్డి, కృపానందం కు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో సబితా ఇంద్రారెడ్డి, కృపానందం విషయంలో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది.
కాగా ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఇటీవలే తెలంగాణ హైకోర్టు నిందితురాలిగా పేర్కొంది. ఆమె దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే ఈ కేసులో శిక్ష పడిన గాలి జనార్ధన్ రెడ్డి, మరో ముగ్గురు దోషులు విడి రాజ్ గోపాల్, బివి శ్రీనివాస రెడ్డి మరియు కె. మెహఫుజ్ అలీ ఖాన్ లకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో వీరంతా బయటే ఉన్నారు.






