TG: ఫీజుల పెంపుపై ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు హైకోర్టులో బిగ్ షాక్

by Prasad Jukanti |

ఫీజుల పెంపుపై ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.

TG: ఫీజుల పెంపుపై ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు హైకోర్టులో బిగ్ షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) నిరాశ ఎదురైంది. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ కాలేజీలు (Private Engineering Colleges) దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై ఫీజుల నియంత్రణ కమిటీకి (టీఏఎఫ్ఆర్సీ) (TAFRC) ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఫీజుల పెంపునకు ప్రభుత్వం నిరాకరించాన్ని సవాల్ చేస్తూ సుమారు 11 ఇంజినీరింగ్ కాలేజీలు గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై నిన్నటి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరపగా ఇవాళ ప్రైవేటు కాలేజీల పిటిషన్లు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రతి యేడు ఇదే తంతా?:

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించి ఏటా ఓ తంతు నడుస్తోందంటూ టీఏఎఫ్‌ఆర్‌సీ తీరుపై నిన్నటి విచారణ సందర్భంగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి మూడేళ్లకోసారి కాలేజీలను పరిశీలించి పెంపుపై నిర్ణయం తీసుకోలేకపోవడం సరికాదంది. ఫీజుల పెంపు కోసం డిసెంబర్ లో ప్రతిపాదనలు వస్తే జూన్ వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు కమిటీలో 15 మంది సభ్యుల వరకు ఉన్నారు. అయినా ఇంత జాప్యమెందుకు అని ప్రశ్నించింది. అలాగే ఫీజులు పెంచాలని టీఏఎఫ్ఆర్ సీ పై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని కాలేజీలను ప్రశ్నించింది. కౌన్సెలింగ్ పూర్తయ్యాక పిటిషన్లు వేయడం ఏంటని మండిపడింది. కాలేజీల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ డిసెంబర్ లో ప్రతిపాదనలు పంపగా మార్చిలో కమిటీ సమావేశమై తమ ప్రతిపాదనలను ఆమోదించిందని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ కాలేజీల్లో కొన్ని గత ఏడాది కంటే సుమారు 70 నుంచి 90 శాతం పెంపు అడుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రైవేట్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఫీజుల విషయంలో ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని టీఏఎఫ్ఆర్సీ ఆదేశించింది.

Next Story