- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Former MLA Konappa: కాంగ్రెస్ కు షాక్...పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనప్ప గుడ్ బై!
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్(Congress) పార్టీకి అనూహ్య షాక్ తగిలింది. సిర్పూర్ కాగజ్ నగర్(Sirpur Kagaznagar) మాజీ ఎమ్మెల్యే (Former MLA) కోనేరు కోనప్ప(Koneru Konappa) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా(Resigns) ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో అధికార కాంగ్రెస్(Congress) పార్టీకి అనూహ్య షాక్ తగిలింది. సిర్పూర్ కాగజ్ నగర్(Sirpur Kagaznagar) మాజీ ఎమ్మెల్యే (Former MLA) కోనేరు కోనప్ప(Koneru Konappa) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా(Resigns) ప్రకటించారు. ఇకపై ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు.
గతంలో బీఆర్ఎస్ నేత అర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వల్లే తాను బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. గతేడాది మార్చి 6న కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్సీ నుంచి పోటీ చేసి నాటి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై కోనప్ప విజయం సాధించారు.
ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో తనపై బీఎస్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో అసంతృప్తికి గురైన కోనప్ప సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఏడాది గడవకుండానే కోనప్ప కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు.
ఇటీవల సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ ఆయన విమర్శించారు. రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లై ఓవర్ ను క్యాన్సిల్ చేయడంపై కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చాలా సార్లు ఫ్లై ఓవర్ పూర్తి చేయాలని చెప్పినా.. స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని..వారికి అంత సీన్ లేదని..గ్రామాల్లోకి వచ్చే నాయకులను గల్లా పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. తాను ఎవరికీ భయపడనని..గతంలో ఇండిపెండెంట్ గా కూడా తాను గెలిచానని..భవిష్యత్తులోనూ అదే మార్గంలో సాగుతానని చెప్పారు.






