చిరంజీవీ న్యూ మూవీ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ కు షాక్.. హైకోర్టులో పిటిషన్

by Prasad Jukanti |   (  Updated:2026-01-10 11:58:30  IST  )

‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

చిరంజీవీ న్యూ మూవీ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ కు షాక్.. హైకోర్టులో పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న్యూ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' పై (Man Shankara Varaprasad Garu) హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా టికెట్ ధరల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం న్యాయవాది విజయ్‌ గోపాల్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో (TG High Court Petition) హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‍పై సెలవు తర్వాత విచారిస్తామన తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించి టికెట్ ధరలను పెంచుతూ తాజాగా తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్స్‌లలో సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ.100 అదనంగా పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవడానికి కూడా సర్కార్ వెసులుబాటు కల్పించింది. అలాగే జనవరి 11న సాయంత్రం 8 గంటల నుంచి రాష్ట్రంలో స్పెషల్ ప్రీమియర్ షోలకు ప్రదర్శించుకోవచ్చని.. అందుకు టికెట్ రేటును రూ.600గా నిర్ణయించినట్లుగా ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు.

Next Story