Shobhayatra: కాసేపట్లో శ్రీరామ నవమి శోభాయాత్ర.. భారీ పోలీసు బందోబస్తు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-06 08:00:17  IST  )

శ్రీరామ నవమి (Srirama Navami) పర్వదినం సందర్భంగా హిందూ సంఘాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఆధ్వర్యంలో శోభాయాత్ర (Shobhayatra)ను అట్టహాసంగా నిర్వహించానున్నారు.

Shobhayatra: కాసేపట్లో శ్రీరామ నవమి శోభాయాత్ర.. భారీ పోలీసు బందోబస్తు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి (Srirama Navami) పర్వదినం సందర్భంగా హిందూ సంఘాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఆధ్వర్యంలో శోభాయాత్ర (Shobhayatra)ను అట్టహాసంగా నిర్వహించానున్నారు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళ్‌హాట్ (Mangalhat) ప్రాంతంలోని సీతారాం భాగ్ (Seethamram Bhag) నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. మొత్తం 6.3 కి.మీ మేర కొనసాగున్న శోభాయాత్ర సుల్తాన్ బజార్‌ (Sultanbazar)లోని హనుమాన్ వ్యాయామశాల (Hanuman Vyayamshala)కు చేరుకోనుంది.

ఈ క్రమంలోనే శోభాయాత్రకు వేలల్లో రామ భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. దాదాపు 20 వేల మంది విధుల్లో ఉండి పర్యవేక్షించనున్నారు. అందులో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (Rapid Action Force), సిటీ‌ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ టీమ్ ఉండనున్నారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో ఇప్పటికే సీసీ కెమెరాను ఫిక్స్ చేసి వాటిని బంజారా‌హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (Command Control Center)కు అనుసంధానం చేశారు. దీంతో ర్యాలీని అక్కడి నుంచే మానిటరింగ్ చేయనున్నారు.

Next Story