హైదరాబాద్‌కు చేరిన సౌదీ ప్రమాద ఘటన మృత్యుంజయుడు షోయబ్‌

by Ramesh Naini |

సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు అబ్దుల్ షోయబ్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్‌కు చేరిన సౌదీ ప్రమాద ఘటన మృత్యుంజయుడు షోయబ్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు అబ్దుల్ షోయబ్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆయనను ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం షోయబ్‌ను నేరుగా వారి నివాసానికి తీసుకెళ్లారు. తనకు, తన కుటుంబానికి విధాలా సహకరించిన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలకు ఈ సందర్భంగా షోయబ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘోర ప్రమాదం కుటుంబాలను, ప్రాంతాన్ని విషాదంలో ముంచెత్తగా, షోయబ్ సురక్షితంగా తిరిగి రావడంతో కొంత ఊరట లభించింది.

నవంబర్ 17న మదీనా సమీపంలో ఉమ్రా యాత్రికులను తరలిస్తున్న బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో 45 మంది భారతీయులు సజీవదహనం కావడం దేశాన్ని కలచివేసింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 16 మంది కూడా మరణించారు. 54 మంది సభ్యులతో హైదరాబాద్ నుంచి నవంబర్ 9న జెడ్డాకు బయలుదేరిన బృందం నవంబర్ 23 వరకు టూర్ ప్లాన్ చేసుకుంది. ఇందులో కొందరు మక్కాలో ఉండగా, కొందరు కారులో మదీనాకు ప్రయాణించారు. మిగిలిన 46 మంది బస్సులో మదీనాకు బయల్దేరుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ బస్సులో ఉన్న వారిలో అబ్దుల్ షోయబ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

Next Story