- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీజీపీ శివధర్ రెడ్డికి గ్రాండ్ ఫేర్‌వెల్.. చివరి రోజు కీలక విషయం రివీల్ చేసిన డీజీపీ
తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి పదవీ విరమణ చేశారు. పబ్లిసిటీ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని పోలీసులకు సూచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇవాళ ఉదయం తెలంగాణ పోలీస్ అకాడమీలో గౌరవ వీడ్కోలు పలికారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసింగ్‍లో గతంతో పోలిస్తే అనేక మార్పులు వచ్చాయని ఈ మార్పుల్లో మేమంతా ప్రత్యక్ష సాక్షులమే కాకుండా భాగస్వాములం కూడా అన్నారు. డిపార్ట్ మెంట్‍లో ఉన్న యువ అధికారులు ఈ మార్పులను పరిగణలోకి తీసుకుని పీపుల్స్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పీపుల్స్ పోలీసింగ్ అనేది ఓ నినాదంగా తీసుకువచ్చాం. దీనికి ఓ కారణం ఉందన్నారు. అంతకు ముందు సాగిన తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు అప్పటి వ్యవస్థలకు పోలీసులు సహకరించారనే అపప్రద తెలంగాణ పోలీసులపై ఉండేదన్నారు. దాంతో ప్రజలకు పోలీసులకు మధ్య దూరం పెరిగిపోయిందన్నారు.
సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్‍కు శ్రీకారం:
ఈ గ్యాప్‍ను తగ్గించేందుకు ప్రజలే పోలీసులు, పోలీసులే ప్రజలు అన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తీసుకువచ్చారన్నారు. అయితే ఈ ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే నేరస్థులతో కూడా ఫ్రెండ్లీగా ఉంటారా ఇది సరైన విధానం కాదేమో అనే సూచనలు కూడా వచ్చాయి. దీంతో నేను డీజీపీగా బాధ్యతలు తీసుకున్నాక సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ విధానానికి శ్రీకారం చూట్టామన్నారు. గత 7 నెలలుగా ఇదే రకమైన విధానం నడుస్తోందన్నారు. అలాగే రాబోయే మార్పులకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉండేందుకు ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ కోసం రిట్రీట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామన్నారు. డిపార్ట్ మెంట్‍లో ఉన్న వారు పబ్లిసిటీ ఓరియెంట్ పోలిసింగ్ కాకుండా పబ్లిక్ సెంట్రిక్ పోలిసింగ్ చేయాలని సూచించారు. డీజీపీగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తనకు వివిధ బాధ్యతలు అప్పగించిన గత ప్రభుత్వాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, నూతన డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
ఎమోషనల్ ట్వీట్:
పదవీ విరమణ సందర్భంగా ఇవాళ ఎక్స్ వేదికగా శివధర్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ పోస్టు చేశారు. నేను పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP)గా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి ఏడు నెలలు పూర్తయ్యాయి. ఈ కాలంలో నాకు తెలంగాణ ప్రజల నుండి, అలాగే హోంగార్డుల నుండి ఐపీఎస్ అధికారుల వరకు పోలీస్ విభాగంలోని ప్రతి ఒక్కరి నుండి అపారమైన మద్దతు సహకారం నాకు లభించింది. శాంతిభద్రతలను కాపాడటంలో, ప్రజల భద్రతను పర్యవేక్షించడంలో మీరు చూపుతున్న అంకితభావానికి, నిబద్ధతకు మరియు మీరు అందిస్తున్న సేవలకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రం శాంతి, సామరస్యాలతో మరియు పటిష్టమైన శాంతిభద్రతలతో నిరంతరం వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.






