ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలి : BJP MLA Raja Singh

by Taduka Kalyani |   (  Updated:2025-06-26 16:17:23  IST  )

ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేసి ఆయన జీవిత చరిత్ర గురించి ప్రతి యువతకు మార్గ నిర్దేశం చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలి : BJP MLA Raja Singh
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేసి ఆయన జీవిత చరిత్ర గురించి ప్రతి యువతకు మార్గ నిర్దేశం చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నారాయణపేట మండలం పేరపల్ల గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నారాయణపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీని నిర్వహించారు. యువత వందలాదిగా ర్యాలీకి కదం తొక్కారు. అడుగడుగునా కాషాయ ధ్వజాలతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఘన స్వాగతం పలికారు. విగ్రహ దాతగా వ్యవహరించిన భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డిని గోషామహల్ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ హిందువుల జోలికి వస్తే సహించేది లేదన్నారు. గో రక్షణ చేయాలని.... హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలన్నారు. రాజాసింగ్ రాకతో జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story