- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి
తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయంలో శివధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయంలో శివధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల ఆశీర్వాదం స్వీకరించి.. డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 1994 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డి తెలంగాణ 6వ డీజీపీగా నియమితులయ్యారు. తొలుత ఏపీ క్యాడర్ కు పనిచేసిన ఆయన.. 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు రీ అసైన్ అయ్యారు. ఐపీఎస్ గా ఉత్తీర్ణులయ్యాక.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1996-2000 సంవత్సరాల్లో విశాఖ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లి సబ్ డివిజన్లలో ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత గ్రే హౌండ్స్ లో అడిషినల్ ఎస్పీగా, తర్వాత ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో విధులు నిర్వహించారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ ట్రీమిజం (LWE)ని అణచివేయడంతో, ఉగ్రవాద కదలికల్ని చేధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.






