చినజీయర్ స్వామి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.. శివ పీఠాధిపతి శివస్వామి ఫైర్

by Ajay Maddhiboyina |

చతురామ్నాయ పీఠాలను ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేయలేదని ఇటీవల చినజీయర్ స్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శివ పీఠాధిపతి శివస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చినజీయర్ స్వామి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.. శివ పీఠాధిపతి శివస్వామి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: చతురామ్నాయ పీఠాలను ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేయలేదని ఇటీవల చినజీయర్ స్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శివ పీఠాధిపతి శివస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. చినజీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అన్నారు. వారి మాటలను పూర్తిగా ఖండిస్తున్నామని.. అవి నిరాదారమైనవి అన్నారు. ఆ పీఠాధిపతుల స్థానాన్ని ఆ పీఠాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారని విమర్శించారు.

చరిత్రను వక్రీకరించే విధంగా ఆయన సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితి తీసుకురావద్దని అన్నారు. వైష్ణవులు, శైవులు కానీ సమాజంలో వారి వారి పాత్ర పోశించుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో జనజీయర్ వ్యాఖ్యలు కల్లోలం క‌లిగించేలా ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. కాబ‌ట్టి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని చినజీయ‌ర్ ను హెచ్చ‌రించారు. చిన‌జీయర్ స్వామి హిందూ సమాజానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే చినజీయర్ స్వామిని ప్రశాంతంగా ఉండనీయబోమ‌ని హెచ్చ‌రించారు.

Next Story