రాహుల్ గాంధీ పర్యటనలను అడ్డుకోవడం సిగ్గు చేటు: యువజన కాంగ్రెస్ నేత జక్కిడి శివ చరణ్ రెడ్డి

by Ajay Maddhiboyina |

ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ దిష్టి బొమ్మలను యూత్ కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

రాహుల్ గాంధీ పర్యటనలను అడ్డుకోవడం సిగ్గు చేటు: యువజన కాంగ్రెస్ నేత జక్కిడి శివ చరణ్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ దిష్టి బొమ్మలను యూత్ కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు గాంధీ భవన్​లో ప్రధాని , బీహార్ సీఎం దిష్టి బొమ్మలు దహనం చేసి, ప్రధాని మోడీ.. నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. లోక్ సభ ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి మోడీ సర్కార్ ఓర్వలేకపోతుందన్నారు.

బీహార్ రాష్ట్రం దర్భంగాలో అంబేద్కర్ హాస్టల్లో దళిత విద్యార్థులను రాహుల్ గాంధీని కలువనీయకుండా కేంద్ర పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని బీజేపీ నియంత పరిపాలనను కొనసాగిస్తుందన్నారు. రాహుల్ గాంధీ పర్యటనలను అడ్డుకోవడం సిగ్గు చేటు అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన రాహుల్ గాంధీకి దేశ ప్రజల్లో ఉన్న ఆదరణను పోగొట్టలేవని స్పష్టం చేశారు. త్వరలోనే మతతత్వ బీజేపీకి దేశ ప్రజలు సరైన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పలు జిల్లాలు, నియోజకవర్గాల, మండలాల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story