తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ ప్రమాణం

by Naga Rani Yarlagadda |

తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు.

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ ప్రమాణం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ రామకృష్ణారావు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు వందేమాతం, జనగణమన ఆలపించారు. అనంతరం శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. శివప్రతాప్.. తెలంగాణ గవర్నర్ గా తన బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తానని తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ ఉండగా.. ఆయన్ను రాష్ట్రపతి మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Next Story