- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SHG సభ్యుల ప్రమాద బీమా పొడిగింపు.. అధికారిక ఉత్తర్వులు జారీ
మహిళా స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: మహిళా స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ మేరకు ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. స్త్రీ నిధి ద్వారా బీమా పథకాన్ని అమలు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఉత్తర్వుల చేశారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రమాద బీమా అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు ఎవరైన SHG సభ్యులు మరణిస్తే వారికి రూ.10 లక్షల బీమా వర్తిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 409 మందికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు, ప్రమాద బీమా పొందేందుకు మహిళలు స్వయం సహాయక బృందాల్లో స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు. ఇప్పటి వరకు 1.67 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. ఈ నేపథ్యంలోనే ప్రమాద బీమాను మరో నాలుగేళ్ల పాటు పొడగిస్తూ ప్రభుత్వం తాజాగా జీవోను జారీ చేసింది.






