- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS.Sharmila అరెస్ట్.. అంబేడ్కర్ విగ్రహం వద్ద హైడ్రామా
హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై శుక్రవారం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద షర్మిల ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేశారు. దీంతో, ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పదేపదే తప్పులు చేస్తున్నారన్నారు. కేసీఆర్ పతనానికి ఇదే నాందని షర్మిల వ్యాఖ్యలు చేశారు. కాగా, షర్మిలను పోలీసులు అరెస్టు చేసి లోటస్ పాండ్ వద్ద తన నివాసానికి తరలించారు.
- Tags
- YS.Sharmila
Next Story






