S.Harish IAS: ఐ అండ్ పీఆర్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్.హరీశ్

by Prasad Jukanti |

ఐ అండ్ పీఆర్ కమిషనర్ గా ఎస్.హరీశ్ బాధ్యతలు స్వీకరించారు.

S.Harish IAS:  ఐ అండ్ పీఆర్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్.హరీశ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ (I&PR Special Commissioner) గా ఎస్.హరీశ్ (S.Harish IAS) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు (M. Hanumantha Rao) యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎస్.హరీశ్ ను స్పెషల్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. ఇదివరకు ఈయన రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. తాజాగా ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ క్రమంలో ఎస్.హరీశ్ ను ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ గా బదిలీ చేసింది. అదనంగా రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా హరీశ్ కు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story