14వేల కోట్లతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ..పనులకు ముహూర్తం ఫిక్స్?

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించాలని (జీహెచ్ఐఎల్) జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యోచిస్తోంది. రూ.14వేల కోట్లతో విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప్రారంభించాల‌ని భావిస్తోంది.

14వేల కోట్లతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ..పనులకు ముహూర్తం ఫిక్స్?
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించాలని (జీహెచ్ఐఎల్) జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యోచిస్తోంది. రూ.14వేల కోట్లతో విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప్రారంభించాల‌ని భావిస్తోంది.శంషాబాద్ విమానాశ్ర‌యానికి ప్ర‌యాణికుల రాక‌పోక‌లు పెర‌గ‌టంతో పాటు విమానాల రాక‌పోక‌లు సైతం పెరిగాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించాలని ఆలోచిస్తున్నారు. విమానరాకపోకలకు కొత్త టర్మినల్ మరియు రన్‌వే నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే విస్తరణ పనులను ప్రారంభించాలని 2029 కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఎయిర్‌పోర్ట్‌ను 2008లో ప్రారంభించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానంతరం దీనికి ఆయన పేరును నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్ భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటిగా ఉంది.

Next Story