- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ‘పద్మశ్రీ’ సమ్మయ్యకు మరోసారి అవమానం!
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మయ్యకు అవమానం జరిగింది. వీఐపీ పాస్ లేదంటూ పరేడ్ గ్రౌండ్స్ వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల వేళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేడుకల్లో పద్మశ్రీ పురస్కార గ్రహిత గడ్డం సమయ్యకు (Gaddam Sammaiah) అవమానం ఎదురైంది. ప్రోటోకాల్ ప్రకారం ఆయనను అతిథిగా కార్యక్రమానికి ఆహ్వానించిన అధికారులు.. ఇవాళ సభా వేదికకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. వీఐపీ పాసు లేదని పోలీసులు అడ్డుకోవడం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ట్యాంక్ బండ్ పై నిర్వహించిన తెలంగాణ దశాబ్ది వేడుకల సమయంలోనూ సమ్మయ్యను అధికారులు అవమానించారని ఇప్పుడు మరోసారి అలాగే వ్యవహరించారని తెలంగాణ వాదులు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. కాగా తెలంగాణలోని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్య చిన్ననాటి నుంచే తన తండ్రితో కలిసి తమ కులవృత్తి చిందు యక్షగాన ప్రదర్శనలో పాల్గొనేవారు. సుమారు 50 ఏళ్లకు పైగా ఈ కళాసేవలో కొనసాగుతున్న గడ్డం సమ్మయ్యకు 2024లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.






