- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన.. ‘టైంపాస్’ నేతలకు అధిష్టానం చెక్!
బెంగాల్ గెలుపు వ్యూహంతో తెలంగాణలో కూడా పాగా వేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: బెంగాల్‌లో అధికారంలోకి రావడంతో కమలనాథులు తెలంగాణపై గురి పెట్టారు. ఈసారి ఎలాగైన ఇక్కడ పాగా వేసి అధికారం దక్కించుకునేందుకు కాషాయ పెద్దలు ప్లాన్చేస్తున్నట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టు కోటా, దీదీ పాలనకు బ్రేక్‌వేసిన కమలం పార్టీ పెద్దలు.. తెలంగాణలో అధికారం చేపట్టడం పెద్ద కష్టమేమీ కాదనే అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. ముందుగా పార్టీకి నిజమైన సేవలందించే వారిని గుర్తించి వారికే పార్టీ కార్యక్రమాల బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తోంది. తర్వాత టైంపాస్నేతలు ఎవరో తేల్చి వారి ఆటలు సాగకుండా కత్తెర వేసేందుకు సిద్ధమైతున్నారు. బెంగాల్ఎన్నికల బాధ్యతలు సీనియర్నేతలైన సునీల్‌బన్సల్, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కు అప్పగించారు. వారు తమ రాజకీయ చాణక్యంతో ఎవరు ఊహించని విధంగా దేశంలోని పార్టీలు నివ్వెరపోయేలా ఎన్నికలు ఫలితాలు సాధించి హైకమాండ్ చేత మన్ననలు పొందారు. దీంతో అగ్రనాయకత్వం తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు సైతం వారిద్దరికే అప్పగిస్తారని ఓ బీజేపీ ఎంపీ వెల్లడించారు.
టైంపాస్ బ్యాచ్‌కు చెక్..
వారిద్దరూ ఇక్కడ రెండు రోజులు మకాం వేసి పార్టీకి నిజంగా సేవలందించే నేతల జాబితాను సిద్ధం చేసి హైకమాండ్‌కు అందజేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రాష్ట్ర పార్టీలో సోకాల్డ్లీడర్లు తప్ప నిజంగా పార్టీ కోసం శ్రమించే వారు లేరని హైకమాండ్తెలుసు. కానీ, ఇప్పటికిప్పడు వారిని దూరం పెడితే కొత్త సమస్యలు వస్తాయని మౌనంగా ఉన్నట్టు సమాచారం. 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత కాషాయ జెండా మోసే వారికే ప్రాధాన్యత ఇస్తారని.. సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకునే వారికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్యాలయంలో నేతలు చర్చించుకుంటున్నారు. ఇక నుంచి పార్టీని బలోపేతం చేసే వారికే పదవులు, నియోజకవర్గాల బాధ్యతలు ఉంటాయని, పార్టీ పేరు చెప్పుకుని టైంపాస్ చేసేవారికి చెక్ పెట్టనున్నట్టు టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నా నేతల మధ్య సఖ్యత లేక స్థానిక ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలం చెందారనే భావన ఢిల్లీ పెద్దల్లో ఉన్నది. రాష్ట్రంలో అధికారం చేపట్టడం కోసం.. కాంగ్రెస్, బీఆర్ఎస్అంతు చూసేందుకు స్వయంగా అగ్రనేతలే నడుం బిగిస్తున్నట్లు పార్టీ సీనియర్ల అంతర్గత సంభాషణలో తెలిసింది. గత గ్రేటర్ఎన్నికల బాధ్యతలు భూపేంద్ర యాదవ్‌కు ఇవ్వడంతో స్ధానిక నేతలను పక్కకు పెట్టి తన రాజకీయ అనుభవంతో బలమైన అభ్యర్థులకు టికెట్లు పంపిణీ చేశారు. నాడు అధికార బీఆర్‌ఎస్‌తో సమానంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ దృష్టిలో రాజకీయ చాణ్యకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
గ్రూపులు కట్టే నేతలపై చర్యలు
పార్టీలో తమదే ఆధిపత్యం ఉండాలని గ్రూపులు కట్టే నేతలకు చెక్‌పెట్టేందుకు పార్టీ సీనియర్లు వ్యూహాలు రచిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుంటే పార్టీపై నిందలు వేయకుండా, కేడర్‌ను తప్పిదారి పట్టించకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఒక నేతకు ఉన్నత పదవి కట్టబెడితే అతనికి ఆ పదవి అప్పగించవద్దని చెప్పే నేతలే పార్టీలో ఎక్కువైనట్లు పార్టీ గుర్తించింది. వీరంతా పార్టీ కోసం శ్రమించాల్సిన విషయాలు పక్కకు పెట్టి ఇతరుల మీద తప్పడు ప్రచారం చేయడం తప్ప మరొకటి లేదు. వారికి సాధ్యమైనంత వరకు జిల్లాలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించనున్నారు. అక్కడ వారు మెరుగైన ఫలితాలు తీసుకొస్తే కొంత ప్రాధాన్యత ఇస్తారు. అదే పాత విధానాలు పాటిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల నిరాకరణ తప్పదు. త్వరలో జరిగే గ్రేటర్ఎన్నికలతో పాటు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేలా కష్టపడి పనిచేసి వారికే కీలక పదవులు కట్టబెట్టే చాన్స్ఉందని పార్టీలో టాక్వినిపిస్తోంది.
మోడీ పథకాలపై ఇప్పటి నుంచే ప్రచారం..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటివరకు ఇచ్చిన పథకాలు, కేటాయించిన నిధులపై ప్రజలకు వివరించేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. ప్రస్తుతం పల్లెలు కేంద్రం ఇచ్చే నిధులతో ముందుకు సాగుతున్నాయి. వీటి గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. వాటిని ప్రతి గ్రామంలో సభ ఏర్పాటు చేసి చెబితే పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా తామే ఇచ్చామని, కేంద్రం ఇవ్వడం లేదని ప్రచారం చేసి పార్టీని ఎదగకుండా కుట్రలు చేస్తున్నారనే విషయాలు ఇంటింటికీ తిరిగి చెప్పేలా పార్టీ కసరత్తు చేయనుంది. ఈనెల 10న జరిగే మోడీ బహిరంగ సభకు ఎవరు పెద్ద సంఖ్యలో జనాలను తరలిస్తారో వారికే పార్టీ పెద్దపీట వేస్తుందని తెలుస్తోంది. ఈ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించి ఇప్పటినుంచే అసెంబ్లీ ఎన్నికలకు సమరం శంఖం పూరించనున్నారు. ఇక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారు.






